Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇటిక్యాలలో ఈతవనం దగ్ధం

ఇటిక్యాలలో ఈతవనం దగ్ధం

వతెలంగాణ-రాయికల్మండలంలోని ఇటిక్యాల శివారులో సోమవారం ట్రాన్స్ఫార్మర్లో షార్ట్సర్క్యూట్ కారణంగా ఈతవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో వేలాది ఈత చెట్లు కాలిబూడిదయ్యాయి.

మంటలు ఆర్పే ప్రయత్నంలో గీత కార్మికుల పనిముట్లు కూడా దగ్ధమైనట్లు గీత కార్మికులు వాపోయారు. శిథిలావస్థలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను మార్చాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ అధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన కుటుంబాలకు రూ.1 లక్ష పరిహారం ఇవ్వాలని, ప్రమాదకర ట్రాన్స్ఫార్మర్ను వెంటనే తొలగించాలని గీతాకార్మికుల సంఘం నాయకులు జవ్వాజి నర్సాగౌడ్, మరిపెళ్లి లక్ష్మణ్గౌడ్ డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana