Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జాతి కన్నా స్నేహం గొప్ప

జాతి కన్నా స్నేహం గొప్ప

క అడవిలో ఏనుగుల గుంపు, తోడేళ్ల గుంపు ఉండేది. ఏనుగుల గుంపులో ఒక ఏనుగు పిల్ల పేరు మహి, తోడేళ్ల గుంపులో ఒక తోడేలు పిల్ల పేరు హిమ. అవి రోజూ ఆ అడవిలో ఉన్న చెరువు దగ్గరికి నీళ్ళు తాగడానికి వెళ్ళేవి.

ఏనుగులంటే తోడేళ్లకు కోపం, తోడేళ్లంటే ఏనుగులకు కూడా పడదు. ఏనుగులు కనబడినప్పుడల్లా తోడేళ్లు వాటిని కరవడానికి ప్రయత్నం చేసేవి, ఏనుగులు తోడేళ్లను తొండంతో విసిరేయ్యడానికి చూసేవి. కానీ వేటికవి తప్పించుకునేవి. అలా ఒకరంటే ఒకరు నచ్చకుండా ఉండేవి. కానీ చిన్నపిల్లలైన మహి, హిమ మాత్రం ఎప్పుడైనా కలిసినప్పుడు ఆడుకుంటూ ఉండేవి. అలా కలవొద్దని వాటితో స్నేహం చెయ్యొద్దని ఏనుగులు మహికి, తోడేళ్లు హిమకు చెప్పేవి. కానీ వాటికి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు నచ్చేవి కాదు.
ఒకసారి మహి తప్పిపోయి ఇంటికి వెళ్లలేక హిమ దగ్గరే ఉండిపోతుంది. అది చూసిన హిమ తల్లిదండ్రులు మహిని చంపడానికి చూస్తాయి. అది గమనించిన మహి, హిమను ఏమీ చెయ్యకండి మేమిద్దరం స్నేహితులం. మహిని ఏమైనా చేస్తే నేను ఉండలేను అంటుంది. చేసేదేం లేక ఇష్టం లేకపోయినా ఎవరూ ఏమీ అనరు. అప్పటినుండి హిమ, మహి హాయిగా ఆడుకుంటూ ఉండేవి. అలా పెరిగి పెద్దవుతాయి.
అనుకోకుండా ఒకనాడు ఒక పులి తోడేళ్లమీదికి దాడికి వస్తుంది. తోడేళ్లు తప్పించుకుంటాయి. కానీ పులి దాడికి గాయపడిన హిమ అక్కడే పడిపోతుంది. దాన్ని కాపాడటానికి భయపడి ఎవరూ ముందుకు వెళ్ళరు. కానీ మహి భయంకరమైన శబ్దాన్ని చేస్తూ తన దంతంతో పులిని పొడవటానికి ముందుకెళ్తుంది. అది ఊహించని పులి ఒక్కసారిగా భయపడి పారిపోతుంది. తోడేళ్ళన్నీ ఊపిరి పీల్చుకుంటాయి. ఇంతలో మహి చేసిన అరుపు విని తమ జాతి అయిన ఏనుగు మహికి ఏమయ్యిందో అని ఏనుగుల గుంపు కూడా అక్కడికి చేరుకుంటుంది. పులిని భయపెట్టిన మహిని చూసి ఆశ్చర్యపోతాయి. తోడేళ్లు కూడా హిమను కాపాడిన మహిని మెచ్చుకుంటాయి. ఇన్నిరోజులు మహిని దూరం పెట్టి బాధ పెట్టినందుకు సిగ్గుపడతాయి. మహి, హిమ స్నేహంతో ఉండటం వల్ల ఒకరికొకరు ఎలా సాయం చేసుకోవొచ్చు అని అక్కడున్న తోడేళ్లు, ఏనుగులు అన్నీ తెలుసుకుంటాయి. అప్పటినుండి జంతువులు అన్నీ కలిసిమెలిసి ఉంటాయి.

- టి. కళ్యాణ్ రామ్
10 వ తరగతి, గురుకుల పాఠశాల
దేవరకద్ర, మహబూబ్ నగర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana