Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జలపాతంలో పడి బీటెక్ విద్యార్థి మృతి

జలపాతంలో పడి బీటెక్ విద్యార్థి మృతి

వతెలంగాణ - హైదరాబాద్ : ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో విషాదం చోటు చేసుకుంది. దూలపురం రేంజ్ అటవీ ప్రాంతంలోని మేషన్ లోద్ది జలపాతంలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు.

సిద్దిపేట జిల్లాకు చెందిన ఆరుగురు యువకులు అటవీ మార్గం గుండా జలపాతానికి వెళ్లారు. అక్కడ స్నానాలు చేస్తుండగా వైభవ్ అనే బీటెక్ విద్యార్థి నీటిలో గల్లంతయ్యాడు. తోటి స్నేహితులు అతడిని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana