Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనసేన నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి

జనసేన నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి

వతెలంగాణ - కామారెడ్డిజనసేన పార్టీ రాష్ట్ర నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ కామారెడ్డి జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణ నడిబొడ్డున ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మీసాల శ్రీనివాసరావు సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా జనసేన పార్టీ నాయకులు కంచర్ల నర్సాగౌడ్ మాట్లాడుతూ.. 22-ఏ ఆర్టికల్ అంశంపై జనసేన పార్టీ ప్రశ్నిస్తే, శాంతియుతంగా నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. జనసేన నాయకులపై అన్యాయంగా అక్రమ కేసులు నమోదు చేస్తే ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నక్క మల్లేష్, జాజిరి దినేష్, ఆశయాల స్వామి, సతీష్ కుమార్, కృష్ణ స్వామి, మలయాళ ప్రభాకర్, సంగీ రవి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana