Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జెమీ ఓవర్టన్ అవుట్

జెమీ ఓవర్టన్ అవుట్

గాయంతో ఐపీఎల్కు దూరంచెన్నై : ఐపీఎల్19లో ఆరంభంలో తడబడినా.. వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై సూపర్కింగ్స్కు గట్టి ఎదురుదెబ్బ. ఈ సీజన్లో 14 వికెట్లు పడగొట్టిన ఓవర్టన్ సూపర్కింగ్స్ విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు.

జెమీ ఓవర్టన్ కుడి కాలు తొడ గాయానికి గురయ్యాడు. దీంతో అతడు చికిత్స కోసం ఇంగ్లాండ్కు బయల్దేరాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన సూపర్కింగ్స్ లీగ్ దశలో మరో 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. దీంతో దక్ష‍ిణాఫ్రికా ఆల్రౌండర్ డయాన్ ఫోరెస్టర్ను సూపర్కింగ్స్ జట్టులోకి తీసుకుంది.

రూ. 75 లక్ష‍లకు ఫోరెస్టర్ సూపర్కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. యువ పేసర్ రామకృష్ణ ఘోష్ సైతం గాయంతో వైదొలగా.. అతడి స్థానంలో కర్ణాటక ఆల్రౌండర్ మాక్నీల్ నోరాన్హాను సూపర్కింగ్స్ తీసుకున్న సంగతి తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana