Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జుక్కల్ లో గత 20 రోజులుగా కొనుగోలు నిలిపివేత

జుక్కల్ లో గత 20 రోజులుగా కొనుగోలు నిలిపివేత

వతెలంగాణ - జుక్కల్ జుక్కల్ మండలంలోని హంగర్గా క్లస్టర్ గ్రామంలో మే 2న సన్ ఫ్లవర్ ఆయిల్ పంటను కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధికారులు ప్రారంభించారు.

ప్రారంభించిన రెండు రోజులు కొనుగోలు చేసిన పంటను తరలించారు. గత 16 రోజులుగా కొనుగోలు నిలిపివేసి రైతులను పట్టిపీడిస్తున్నారు. రోజుకో సాకులు చెబు గన్ని బ్యాగులు లేవని, రేపు వస్తాయని ఎల్లుండి వస్తాయని ఆశ చూపుతూ సమయాన్ని వృధా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మద్దతు ధర 7వేల పైచిలుకు ఉండడంతో రైతులు సంతోషం తో పంటను కొనుగోలు కేంద్రానికి తెస్తే గత 16 రోజులుగా కొనుగోలు నిలిపివేసి రాత్రింబవళ్లు ఇక్కడే బస చేసిన రైతులకు నానా అవస్థలు పడుతున్నారు.

రాత్రిపూట విద్యుత్ సౌకర్యం లేక చీకట్లోనే ఆడుకుంటున్నామని, దోమలు కుడుతున్నాయని, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు ఇప్పటికే రెండుసార్లు పడి కింది భాగంలో నీరు వచ్చి సన్ఫ్లవర్ పంటకు విత్తనాలకు మొలకలు వచ్చి బూజు పట్టి దుర్వాసన వెదజల్లుతుందని తెలిపారు. ఇదే అది నువ్వే భావించిన దళారులు రంగ ప్రవేశం చేసి కొనుగోలు కేంద్రాల వద్దే రైతులకు 6వేల రూ' కొనుగోలు చేస్తామని నానా రకాలుగా కండిషన్లు పెడుతూ కొనుగోలు చేస్తున్నారు. పట్టించుకోవలసిన సొసైటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూన్పారని రైతుల ఆరోపిస్తున్నారు. కనీసం త్రాగునీరు కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. వర్షాకాలం సమీపిస్తున్నా తరుణంలో దుక్కులు దున్నుకోవడం చెత్తలు ఏరడం వ్యవసాయ పనులను ఆపేసి 16 రోజులుగా కొనుగోలు కేంద్రం వద్దే రాత్రి పగలు పడిగా పలుకాస్తూ నానా అవస్థలు పడుతున్నామని అడిగే వారు లరని అన్నారు. ఇప్పటికైనా సొసైటీ అధికారులు వెంటనే సన్ ఫ్లవర్ ఆయిల్ పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కొనుగోలు చేయకపోతే జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే కొనుగోలు ప్రారంభించే విధంగా అధికారులకు ఆదేశించాలని రైతులు వేడుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana