Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూలై 11న అరుణోదయ నాగన్న సంతాప సభ

జూలై 11న అరుణోదయ నాగన్న సంతాప సభ

వతెలంగాణ-ఆలేరు టౌన్ తన బ్రతుకునే ప్రజాపాటగా మార్చుకున్న మహా గాయకుడు అరుణోదయ నాగన్న సంతాప సభ ఆలేరు పట్టణంలోని ఫ్రెండ్స్ క్లబ్ లో జూలై 11న నిర్వహించనున్నట్లు, అరుణోదయ యాదాద్రి జిల్లా నాయకులు ఇక్కిరి సహదేవ్ అన్నారు.

అరుణోదయ నాగన్న ఈ నెల 3న అనారోగ్యంతో మరణించాగా.. ఆయన స్మృతిలో ఈ నెల 11న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య యాదాద్రి-భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగే సంతాప సభను విజయవంతం చేయాలని ఆలేరు పట్టణంలో బుధవారం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సహదేవ్ మాట్లాడుతూ ..అరుణోదయ నాగన్న అరుణోదయ సంస్థ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులుగా, న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకులుగా సేవాలాందించారన్నారు. కార్యక్రమంలో అరుణోదయ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ ఉదయ్, సిద్దేశ్వర్, నాయకులు బేజాడి కుమార్, సుంచు రాములు, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana