Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూరాల 33 గేట్లు ఎత్తివేత

జూరాల 33 గేట్లు ఎత్తివేత

న్ ఫ్లో 2 లక్షలా 52 వేల క్యూసెక్కులు దిగువకు 2 లక్షలా 49 వేల క్యూసెక్కులు
కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
నవతెలంగాణ-ధరూర్

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 33 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

బుధవారం సాయంత్రం 6గంటల సమయానికి ప్రాజెక్టుకు 2,52,000 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. వరద ఉధృతి ఉండడంతో ప్రాజెక్టు 33 గేట్లను ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. ఇన్ప్లో 2,49,378 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 2,52000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నుంచి స్పిల్వే ద్వారా 2,19,289 క్యూసెక్కులతో పాటు పవర్హౌస్ కు 26,300, కాలువల ద్వారా కలిపి మొత్తం 2,49,378 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్లో 8.631 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నెట్టెంపాడు 437, బీమా లిఫ్ట్`1 1300, కోయిలసాగర్ 630, ఎడమ కాలువ 1030, కుడి కాలువకు 600, బీమా లిఫ్టు-2 872, ప్యానల్ కాలువకు 600 క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్ డ్యామ్లో ప్రస్తుత నీటి మట్టం 491.34 ఉండగా ఆల్మట్టి డ్యాము నుంచి నారాయణపురం డ్యాంకు 1,68,546 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 2,52,000 క్యూసెక్కులు ప్రస్తుత నిల్వ 29.23 టీఎంసీలు (87.76శాతం) ప్రస్తుత నిల్వ 14.47 టీఎంసీ ఉంది.
అల్మట్టి జలాశయం ప్రస్తుత నీటి నిల్వ మట్టం 518.89 మీటర్లు కాగా ఆల్మట్టికి ఎగువ ప్రాంతం నుంచి సగటున 1,35,428 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. వరద నీరు బాగా పెరగడంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana