Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాచికల్ క్రాస్-మేచరాజుపల్లి రోడ్డుకు నిధులు మంజూరు చేయాలి

కాచికల్ క్రాస్-మేచరాజుపల్లి రోడ్డుకు నిధులు మంజూరు చేయాలి

వతెలంగాణ-నెల్లికుదురుమండలంలోని కాచికల్ క్రాస్ రోడ్ నుంచి మేచ రాజు పల్లి గ్రామం వరకు తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ లను ఎర్రబెల్లి గూడెం, బడి తండ, సౌల్ల తండా గ్రామాల సర్పంచులు గుండెబోయిన ఉష అశోక్ యాదవ్, బిలావత్ ధనమ్మ అమృనాయక్, గుగులోతు సుజాత వాసు నాయక్, ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిలుకర సాంబమూర్తి మాజీ సర్పంచ్ బండారు మల్లయ్య లు కోరినట్లు తెలిపారు.

గ్రామాల నేతలతో మంగళవారం హైదరాబాదులోని వారి నివాస గృహాల్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిధులు లేకుండానే రోడ్డు నిర్మాణం చేపట్టి రోడ్డును పూర్తిగా ధ్వంసం చేయడంతో నాలుగు గ్రామాలతో పాటు సుమారు 20 తండాల ప్రజలు గత రెండు సంవత్సరాలుగా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని తక్షణమే ప్రత్యేక నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు ఎంపీ ఎమ్మెల్యేలకు వివరించారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ ఎమ్మెల్యేలు త్వరలోనే నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎంపీ ఎమ్మెల్యేలను కలిసిన వారిలో మాజీ సర్పంచ్ బండారి మల్లయ్య,, కాంగ్రెస్ మండల కార్యదర్శి సొంటి రెడ్డి అశోక్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు పనికేర ఉపేందర్ యాదవ్, యువజన కాంగ్రెస్ నేత బండారి రమేష్ తదితరులున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana