Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కామారెడ్డి రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని మహిళ మృతి

కామారెడ్డి రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని మహిళ మృతి

వతెలంగాణ - కామారెడ్డికామారెడ్డి రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెం.1పై గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైందని రైల్వే ఎస్సై సాదు లింబాద్రి తెలిపారు.

రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల ఓ మహిళ సిమెంట్ బెంచ్పై అపస్మారక స్థితిలో కనిపించగా, పరిశీలించగా ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. అనారోగ్య కారణాలతో మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతురాలు పంజాబీ డ్రెస్ ధరించి ఉండగా, బ్లూ కలర్ టాప్పై బ్లూ అండ్ వైట్ చెక్స్ డిజైన్ ఉండటం, పైగా బ్లూ కలర్ షర్ట్, రెడ్ కలర్ చున్నీ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

భిక్షాటన చేస్తూ జీవనం సాగించేదిగా అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. ఆమె వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి కామారెడ్డి మార్చురీ ఫ్రీజర్లో భద్రపరిచినట్లు రైల్వే ఎస్సై సాదు లింబాద్రి తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు లేదా బంధువులు ఎవరైనా ఉంటే 87126 58614 నంబర్కు సమాచారం అందించాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana