Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సి వర్తింపజేయాలి

నవతెలంగాణ కంటేశ్వర్
కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సి వర్తింపజేయాలని, సిపీఎస్ ఉద్యోగుల చందాలను వారి కుటుంబ సభ్యులకు అందించాలని టీపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం టీపీటీఎఫ్ అధ్యక్షులు రమణ అసోసియేట్ అధ్యక్షులు అశోక్ కుమార్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ తిరుపతి జనరల్ సెక్రెటరీ నర్సింలు ఓ ప్రకటన విడుదల చేశారు. పి ఆర్ సి ని వర్తింప చేస్తామన్న ప్రకటనకు అనుగుణంగా మూడు రోజుల క్రితం ఆర్థిక శాఖ ఉత్తర్వులు 51 నుండి 60 వరకు విడుదల చేయడం జరిగిందన్నారు. అయితే ఉత్తర్వుల్లో అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్ పి ఎస్ 20 20 వర్తించకుండా పలు అంశాలలో ఉద్యోగులకు నష్టం వాటిల్లే విధంగా అసంబంధాలు కలిగి ఉన్నాయన్నారు వాటిని ప్రభుత్వం పరిశీలించి అసెంబ్లీ ప్రకటన కు అనుగుణంగా రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల అందరికీ వేతన సవరణ ఉత్తర్వులు వర్తించేలా తగు సవరణలు ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని తొమ్మిది పదిహేడు 70 61 మంది ఉద్యోగులకు పిఆర్సి వర్తించేలా చేయలేదని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు వర్తించకుండా ఉత్తర్వులు సంఖ్య 60 ప్రకారం కేవలం మూడు కేటగిరీల వేతనం పొందుతున్న వారికి వేతన సవరణ వర్తించే విధంగా ఉందన్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మార్పు లను సవరించాలని లేనియెడల అన్ని సంఘాల నాయకులను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana