Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండారి శేఖర్‌
- మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ - చొప్పదండి
కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండారి శేఖర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం చొప్పదండి మున్సిపల్‌ కార్యలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్బంగా శేఖర్‌ మాట్లాడుతూ.. కార్మికుల పీఎఫ్‌, ఈఎస్‌ఐ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. అనారోగ్యంతో మృతిచెందిన మున్సిపల్‌ కార్మికుడు బత్తిని హన్మండ్లు కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్యకు సమస్యలను వివరించారు.

15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కమిషనర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యశోద రవీందర్‌, జనగాం రాజమల్లు, చొప్పదండి మున్సిపాలిటీ నాయకులు అమర్‌, ప్రభాకర్‌ రెడ్డి, శంకరయ్య, సతీష్‌, వెంకటయ్య పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana