Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కార్మికులు కార్మిక శాఖ గుర్తింపు కార్డులు పొందాలి

కార్మికులు కార్మిక శాఖ గుర్తింపు కార్డులు పొందాలి

వతెలంగాణ-రాయికల్అసంఘటిత కార్మికులు తప్పనిసరిగా తమ వివరాలు నమోదు చేసుకుని కార్మిక శాఖ గుర్తింపు కార్డులు పొందాలని మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్ అన్నారు.మంగళవారం రాయికల్ పురపాలక కార్యాలయంలో మెట్ పల్లి కార్మిక శాఖ ఆధ్వర్యంలో లేబర్ కార్డుల నమోదు,వాటి ద్వారా లభించే ప్రభుత్వ ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు లేబర్ కార్డులు పొందడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా అందుతాయని తెలిపారు.ఈనెల 10వ తేదీ వరకు మండల కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మెట్ పల్లి అసిస్టెంట్ కార్మిక శాఖ అధికారి కృష్ణసాగర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాకేష్ నాయక్,పుర్రె శ్రీధర్,నాయకులు తురగ శ్రీధర్ రెడ్డి,మచ్చ శేఖర్, తొపారపు సురేష్,వేముల రాము తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana