ఈ సందర్భంగా న్యాయవాదులు ఆకుల రాములు, మెషినేని శ్రీనివాస్ రావు, అబ్దుల్ కలాం, రంజిత్ కుమార్, ఆరేళ్లి వెంకటస్వామి, రేపాల సంతోష్, ఇందారపు శివకుమార్, వల శ్రవణ్ రావు, పొలం సతీష్ తదితరులు కోర్టు ఏర్పాటుపై తమ అభిప్రాయాలు, అవసరాలను జడ్జి గారికి వివరించారు.
గత కొంతకాలంగా కాటారం ప్రాంత ప్రజలు కోర్టు ఏర్పాటును కోరుతూ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక ప్రజల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. కోర్టు ఏర్పాటు ద్వారా ప్రజలకు న్యాయ సేవలు మరింత వేగంగా, సులభంగా అందుబాటులోకి రానున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, రెవెన్యూ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

