Dailyhunt

కావేరి సీడ్స్ లాభాల్లో 29శాతం వృద్ధి

హైదరాబాద్‌: ప్రముఖ విత్తనాల కంపెనీ కావేరి సీడ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 28.62 శాతం వృద్థితో రూ.295.29 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.229.57 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.627.57 కోట్లుగా ఉన్న కంపెనీ అమ్మకాలు.. క్రితం త్రైమాసికంలో 14.64 శాతం పెరిగి రూ.719.48 కోట్లకు చేరాయి. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని ఆ కంపెనీ చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జివి సుబ్బారావు పేర్కొన్నారు. తమకు దేశవ్యాప్తంగా 40వేల మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారన్నారు. తమ పోర్టుపోలియోలో మరికొన్ని ఉత్పత్తులను జోడిస్తున్నట్టు తెలిపారు.

తమ లాభదాయకతలో మొక్కజొన్న, వరి కీలక మద్దతును అందించాయన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana