Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కక్ష్యలోకి భారత్ దృష్టి

కక్ష్యలోకి భారత్ దృష్టి

ప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ ఉపగ్రహంభారత్లోని ప్రయివేటు సంస్థ నిర్మించిన అతిపెద్ద శాటిలైట్
కాలిఫోర్నియా: బెంగళూరుకు చెందిన అంతరిక్ష అంకుర సంస్థ గెలాక్స్ఐ పంపించిన 'దృష్టి' ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది.

కాలిఫోర్నియాలోని ప్రయోగ కేంద్రం నుంచి ఫాల్కన్-9 రాకెట్ సాయంతో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు గెలాక్స్ఐ వెల్లడించింది. ఇది ప్రపంచంలో ఆప్టో-సార్ సాంకేతిక కలిగిన మొట్టమొదటి ఉపగ్రహమని పేర్కొంది. భూ పరిశీలన సాంకేతికత పరిజ్ఞానంలో ఇది కీలక మైలురాయి అని తెలిపింది. '190 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం..

భారత్లోని ప్రయివేటు సంస్థ కక్ష్యలోకి భారత్ దృష్టి నిర్మించిన శాటిలైట్లలో అతిపెద్దది. 1.5 మీటర్ల రిజల్యూషన్తో చిత్రాలను అందిస్తుంది. ఆప్టో-సార్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. ఎలక్ట్రో ఆప్టికల్ (ఈఓ), సింథటిక్ ఎపెర్చర్ రాడార్ (ఎస్ఏఆర్) సెన్సర్లతో కలిపి పరిశీలనలు సాగిస్తుంది.

అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లో.. పగలు, రాత్రి తేడా లేకుండా భూమిని నిరంతరం పరిశీలించే సామర్థ్యం దీని సొంతం' అని గెలాక్స్ఐ పేర్కొంది. గెలాక్స్ఐ చేపట్టిన దృష్టి ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష పరిశోధనల్లో ఇదో కీలక విజయంగా నిలుస్తుందన్నారు. దేశ పురోగతి, ఆవిష్కరణల పట్ల యువత అభిరుచికి ఇదో నిదర్శనమన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana