Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కళాశాలల బంద్ విజయవంతం

కళాశాలల బంద్ విజయవంతం

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు నవతెలంగాణ - కామారెడ్డి
పాత పద్ధతిలోనే ఫీజు రీయాంబర్స్మెంట్ అమలు చేయాలని, ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన కాలేజీల బంద్ విజయవంతం అయిందని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు అన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రవేట్ కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయని, ప్రభుత్వ కళాశాలలను బంద్ చేయించామన్నారు. ఫీజు రీయాంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నటువంటి జీఓ 9 ని తక్షణమే రద్దు చేసి, పాత పద్ధతిలోనే అమలు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిరంతరం చేపడతామని ప్రభుత్వాన్ని ఆయన హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు,గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు వినోద్ నాయక్, బిసి ప్రధాన కార్యదర్శి దయాకర్, ప్రవీణ్, సంతోష్, వినీత్, ప్రభు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana