నవతెలంగాణ - మల్హర్ రావుకాళోజీ నారాయరావు జయంతి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం కాళోజి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్స్ పల్ విజయదేవి,ఉపన్యాసకులు, విద్యార్థులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ భాష యాస కొరకు తను రాసినటువంటి రచనలను నిజాం నవాబుల దమన నీతిని,అన్యాయాన్ని నిరసిస్తూ రాసిన రచనల గురించి విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపన్యాసకులు,కళాశాల సిబ్బంది,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

