Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కల్లెడలో జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమం

కల్లెడలో జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమం

వతెలంగాణ - ఆర్మూర్ : ఆలూరు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాక్లూర్ పరిధిలోని కల్లెడ గ్రామంలో సొసైటీ అధ్యక్షులు బురోల్ల అశోక్,కల్లెడ గ్రామ సర్పంచ్ సుస్మిత ప్రళయ్ తేజ్ ఆధ్వర్యంలో జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. రైతులు ఆధునిక పద్ధతుల్లో సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ప్రభుత్వం రైతుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. మండలంలోనే ముందుగా జీలుగు విత్తనాల పంపిణీ చేపట్టడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కల్లెడ గ్రామ సర్పంచ్ సుస్మిత ప్రళయ్ తేజ్, ఆలూరు మండల వ్యవసాయ అధికారి రాంబాబు, సంఘ డైరెక్టర్ పులమంటి గంగారాం, రైతులు నీలగిరి శ్రీనివాస్, శశి, మహేష్, నడ్పి గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana