Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కమీషనర్ కు ఆదేశాలు జారీ చేసిన మంత్రి తుమ్మల

కమీషనర్ కు ఆదేశాలు జారీ చేసిన మంత్రి తుమ్మల

- అశ్వారావుపేటను అభివృద్ధి పథంలో పెట్టండి- కమీషనర్ దిలీప్ రెడ్డికి మంత్రి తుమ్మల ఆదేశం
నవతెలంగాణ - అశ్వారావుపేట
: అశ్వారావుపేటను ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని, తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న ఈ పట్టణాన్ని మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మున్సిపల్ కమీషనర్ దిలీప్ రెడ్డికి సూచించారు.

ఉద్యాన కళాశాల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి తుమ్మలను కమీషనర్ దిలీప్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధిపై మంత్రి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా డివైడర్లలో పూల మొక్కలు నాటించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. గ్రూప్-1 అధికారి హోదాలో బాధ్యతలు చేపట్టిన దిలీప్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండి డైనమిక్గా పనిచేయాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఛాన్సలర్ రాజిరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana