Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కన్నుల పండువగా అమ్మవారి అభిషేకాలు

కన్నుల పండువగా అమ్మవారి అభిషేకాలు

వతెలంగాణ - కట్టంగూర్ మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ దేవ స్థానంలో నూతనంగా ప్రతిష్టమైన శ్రీ చక్ర సహిత దుర్గా మాతకు శుక్రవారం అభిషేకాలు కన్నుల పండువగా నిర్వహించారు.

ఆలయ పూజారి రామడుగు శ్రీనివాసు శర్మ, అశ్విన్ శర్మ, రోహిత్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె పంచ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేశారు కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీరామ్ సంధ్యా వీరేశం, బొమ్మగాని మహేష్ , మాజీ వార్డు సభ్యులు కాపుగంటి గోపి, ఆలయ కమిటీ సభ్యులు కోమటి భాస్కర్, బండారు అరుణ్, కాపుగంటి నరేష్, కొంపెల్లి లక్ష్మయ్య మంగమ్మ దంపతులు, రెడ్డిపల్లి సైదులు సైదమ్మ దంపతులు అయితగోని శివ,కొల్లు వీరేశం, ఇల్లెందుల పద్మ, కొంపెల్లి సుజాత తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana