Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కరోన బాధితులకు ఎమ్మెల్యే సీతక్క సహాయం

కరోన బాధితులకు ఎమ్మెల్యే సీతక్క సహాయం

గోవిందరావుపేట: కరోనా తో బాధపడుతున్న పలు కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క ఆదేశానుసారం కూరగాయలు నిత్యవసర వస్తువులు ఆదివారం స్థానిక కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాలమేరకు గోవిందరావుపేట మండల కేంద్రంలోని ప్రాజెక్ట్ నగర్ , టప్పమంచ మరియు మోట్లగూడెం గ్రామాల్లో కరోన బారినపడిన దాదాపు 40 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు బియ్యం , పప్పులు, వివిధ కూరగాయలు మరియు పిల్లలకు బిస్కెట్స్ అందజేయటం జరిగిందని వారు తెలిపారు.త్వరలో మరికొన్ని గ్రామాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని సీతక్క తెలిపినట్లు వారు పేర్కొన్నారు
కరోనా బాధితులు ఎలాంటి ఆధైర్యానికి గురికావద్దని డాక్టర్లు చెప్పిన విధంగా నడుచుకొని కరోనా ను ఉమ్మడిగా పారద్రోలాలని కరోనా బాధితులకు సహాయం గా ఉందామని వారన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ టి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్సం కన్నయ్య , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి , యూత్ కాంగ్రేస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కు రణదీప్ గౌడ్ , గ్రామ సర్పంచ్ సనప సమ్మయ్య , గ్రామ అధ్యక్షుడు కన్నయ్య , వార్డ్ మెంబెర్ ,యూత్ కాంగ్రేస్ ప్రధాన కార్యదర్శి ఈక శేషు ,గ్రామ నాయకులు రాంబాబు , రామూర్తి , నరేష్ , సురేష్ , సాయి మరియు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

గోవిందరావుపేట: కరోనా తో బాధపడుతున్న పలు కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క ఆదేశానుసారం కూరగాయలు నిత్యవసర వస్తువులు ఆదివారం స్థానిక కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాలమేరకు గోవిందరావుపేట మండల కేంద్రంలోని ప్రాజెక్ట్ నగర్ , టప్పమంచ మరియు మోట్లగూడెం గ్రామాల్లో కరోన బారినపడిన దాదాపు 40 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు బియ్యం , పప్పులు, వివిధ కూరగాయలు మరియు పిల్లలకు బిస్కెట్స్ అందజేయటం జరిగిందని వారు తెలిపారు.త్వరలో మరికొన్ని గ్రామాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని సీతక్క తెలిపినట్లు వారు పేర్కొన్నారు
కరోనా బాధితులు ఎలాంటి ఆధైర్యానికి గురికావద్దని డాక్టర్లు చెప్పిన విధంగా నడుచుకొని కరోనా ను ఉమ్మడిగా పారద్రోలాలని కరోనా బాధితులకు సహాయం గా ఉందామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్సం కన్నయ్య , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి , యూత్ కాంగ్రేస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కు రణదీప్ గౌడ్ , గ్రామ సర్పంచ్ సనప సమ్మయ్య , గ్రామ అధ్యక్షుడు కన్నయ్య , వార్డ్ మెంబెర్ ,యూత్ కాంగ్రేస్ ప్రధాన కార్యదర్శి ఈక శేషు ,గ్రామ నాయకులు రాంబాబు , రామూర్తి , నరేష్ , సురేష్ , సాయి మరియు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana