Thursday, 29 Jul, 11.45 am నవ తెలంగాణ

హోం
కరోనా బారిన పడిన ఏపీ డిప్యూటీ సీఎం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కలతూర్‌ నారాయణస్వామి కరోనా బారినపడ్డారు. రెండు రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయనకు ఇవాళ వైద్యాధికారులు కొవిడ్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోంఐసొలేషన్‌కు వెళ్లారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నారాయణస్వామి పేర్కొన్నారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి తగ్గుతున్నా.. మరణాలు మాత్రం కొనసాగుతున్నాయి. వైరస్‌ బారినపడిన వారిలో నిత్యం 15 నుంచి 20 మంది మృతి చెందుతున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top