ఇంఫాల్ : నలుగురు వైద్యులు, ఓ స్టాఫ్ నర్సుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రభుత్వ ఆసుపత్రిని మూసివేసిన ఘటన మణిపూర్ లోని బిష్ణుపూర్ జిల్లా లీమాపోకపం పట్టణంలో వెలుగుచూసింది. ఇంఫాల్ నగర పోలీసుస్టేషను ఎదురుగా ఉన్న హోటల్లో ముగ్గురికి కరోనా సోకడంతో ఇంఫాల్ నగరంలోని మూడు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా పశ్చిమ ఇంఫాల్ జిల్లా కలెక్టరు ప్రకటించారు. కరోనా వ్యాప్తి చెందకుండా స్థానిక వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల రోడ్డుపై ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. క్వారంటైన్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. మణిపూర్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.
