Dailyhunt

కరోనాతో నర్సు మృతి.. అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు

తమిళనాడు: కరోనాతో మృతి చెందిన నర్సు అంత్యక్రియలను స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన రాణిపేట జిల్లా ఆర్కాడుకు చెందిన 36 ఏళ్ల మహిళ స్థానిక ప్రభుత్వాస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. గత నెల 31న జ్వరానికి గురైన ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సలు ఫలించక ఈ నెల 3వ తేది ఆమె మృతిచెందారు. ఆమె మృతదేహాన్ని రాణిపేట సమీపం నదల్‌పూర్‌లో ఉన్న కల్లరైతోట్టమ్‌లో ఖననం చేసేందుకు అంబులెన్స్‌లో తీసుకురాగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో రెవెన్యూ శాఖ అధికారులు అక్కడకు చేరుకొని ప్రజలతో చర్చించారు.

తగిన భద్రత కల్పించి మృతదేహాన్ని ఖననం చేస్తామని అధికారులు తెలిపారు. మృతదేహానికి నివాళులర్పించేందుకు బంధువులను అనుమ తించరాదని, అంబులెన్స్‌ నుంచి నేరుగా తీసుకెళ్లి మృతదేహాన్ని ఖననం చేయాలని గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఈమేరకు మృతదేహాన్ని ఖననం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana