Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కవయిత్రి మంజుల పత్తిపాటిని వరించిన మిత్ర రత్నావళి బిరుదు

కవయిత్రి మంజుల పత్తిపాటిని వరించిన మిత్ర రత్నావళి బిరుదు

వతెలంగాణ-ఆలేరు టౌన్తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు సంస్కృతి ఔన్నత్యాన్ని, మన సంప్రదాయాల వైభవాన్ని తన అద్భుతమైన కవితా శిల్పంతో సజీవంగా ఆవిష్కరించి, సాహిత్యరంగంలో విశిష్టమైన సేవలను అందిస్తూ, పాఠక హృదయాలను అలరిస్తున్న కవయిత్రి మంజుల పత్తిపాటిని 'మిత్ర రత్నావళి' బిరుదు వరించింది.

స్నేహం అనే పవిత్ర బంధానికి ప్రతీకగా జులై 30న నిర్వహించిన స్నేహితుల దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా-సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే స్ఫూర్తిదాయకమైన కవిత్వాన్ని రచించిన సాహిత్య ప్రతిభను, సాంస్కృతిక నిబద్ధతను గౌరవిస్తూ 'మిత్ర రత్నావళి' బిరుదును విజయవాడలో ఆగష్టు 2న హనుమంతరాయ గ్రంథాలయంలో తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ, ఉషోదయ ఫౌండేషన్ వారు అత్యంత గౌరవంతో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana