Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేబీఆర్ పార్క్ పరిరక్షణపై సుప్రీం కీలక ఆదేశాలు

కేబీఆర్ పార్క్ పరిరక్షణపై సుప్రీం కీలక ఆదేశాలు

వతెలంగాణ - హైదరాబాద్: కేబీఆర్ నేషనల్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్క్ చుట్టుపక్కల ఉన్న ఈకో-సెన్సిటివ్ జోన్లో చెట్లు నరకడాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ బి.వి.

నాగరత్న, జస్టిస్ ఉజ్జ్వల్ భుయాన్ల ధర్మాసనం తాత్కాలిక స్టే విధించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేబీఆర్ పార్క్ ఈకో-సెన్సిటివ్ జోన్లో సుమారు 1,300 చెట్లను నరికే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 50 చెట్ల వరకు పగలు-రాత్రి తేడా లేకుండా నరుకుతున్నారని తెలిపారు. ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం కోసం చెట్ల నరికివేత తప్పదని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana