Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కెనాల్లోకి బల్క్ మిల్క్ వ్యర్థాల విడుదల

కెనాల్లోకి బల్క్ మిల్క్ వ్యర్థాల విడుదల

-ఓపెన్ జిమ్ వద్ద దుర్వాసనతో వ్యాయామం చేయలేకపోతున్న ప్రజలు-చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
నవతెలంగాణ - రాయికల్
పట్టణ శివారులోని ఓపెన్ జిమ్ ప్రాంతంలో ఉన్న ఓ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ నుంచి వెలువడుతున్న వ్యర్థ ద్రవపదార్థాలు పక్కనే ఉన్న ఎస్సారెస్పీ కెనాల్లో కలుస్తుండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం వ్యాయామం చేసేందుకు వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ నుంచి వెలువడే వ్యర్థ జలాలు నేరుగా కెనాల్లోకి చేరుతున్నాయని, దీనివల్ల నీరు కలుషితమవుతోందని ఆరోపిస్తున్నారు.

వ్యర్థాల కారణంగా పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపిస్తోందని, ఓపెన్ జిమ్కు వచ్చే వారు ముక్కు మూసుకుని వ్యాయామం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. పర్యావరణ నిబంధనల ప్రకారం డెయిరీ, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల నుంచి వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా బయటకు విడుదల చేయరాదని తెలిసినా సంబంధిత యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యర్థ జలాలను శుద్ధి చేసే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి, కెనాల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కెనాల్ కాలుష్యంపై పరిశీలన జరిపి, ప్రజారోగ్యానికి హాని కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana