Sunday, 09 May, 10.45 pm నవ తెలంగాణ

హోం
కేంద్రమంత్రికి ​​​​​​రోడ్డు ప్రమాదం..గాయాలు

హైదరాబాద్ : ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా నీలగిరి ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రి ప్రతాప్‌ చంద్ర సారంగి స్వల్పంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఆయన ఓ కుటుంబానికి సాయం చేసేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కేంద్రమంత్రిని ఆసుపత్రికి తరలించారు. ఆయనతో పాటు పీఏ, కారు డ్రైవర్‌, వ్యక్తిగత భద్రతాధికారికి కూడా గాయాలయ్యాయి. ట్రాక్టర్‌ అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top