హైదరాబాద్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లా నీలగిరి ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర సారంగి స్వల్పంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఆయన ఓ కుటుంబానికి సాయం చేసేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కేంద్రమంత్రిని ఆసుపత్రికి తరలించారు. ఆయనతో పాటు పీఏ, కారు డ్రైవర్, వ్యక్తిగత భద్రతాధికారికి కూడా గాయాలయ్యాయి. ట్రాక్టర్ అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

