Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కెప్టెన్ తిలక్ వర్మ సెంచరీ మిస్

కెప్టెన్ తిలక్ వర్మ సెంచరీ మిస్

వతెలంగాణ - హైదరాబాద్ : దులీప్ ట్రోఫీ ఫైనల్లో నాలగువ రోజు ఇవాళ తన ఫస్ట్ ఇన్నింగ్స్లో సౌత్ జోన్ 336 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ ఒక్క రన్ తో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

అతను వ్యక్తిగతంగా 99 రన్స్ వద్ద ఔటయ్యాడు. తిలక్ వర్మ పోరాడినా.. ఈస్ట్ జోన్ మాత్రం భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఈస్ట్ జోన్కు ఫస్ట్ ఇన్నింగ్స్లో 372 రన్స్ లీడ్ దక్కింది.

ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీసుకోగా, షమీ.. ఖురేషి, మోహన్.. రెండేసి వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం లంచ్ కావడంతో.. సౌత్ జోన్ ఫాలోఆన్ ఆడుతుందా లేక ఈస్ట్ జోన్ మళ్లీ బ్యాటింగ్ చేస్తుందా అన్న దానిపై క్లారిటీ లేదు. ఈస్ట్ జోన్ తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 708 రన్స్ చేసిన విషయం తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana