Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేరళం CBSE కార్యాలయం ఎదట SFI ఆందోళన

కేరళం CBSE కార్యాలయం ఎదట SFI ఆందోళన

వతెలంగాణ-హైదరాబాద్: కేరళంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆందోళనలు చేపట్టింది. CBSE పరీక్షల నిర్వహణలో తలెత్తిన లోపాలను తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు ఇక్కడి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రాంతీయ కార్యాలయం ఎదట బైటాయించారు.

పరిపాలనాపరమైన లోపాల కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో నెట్టేశరని SFI రాష్ట్ర కార్యదర్శి పిఎస్. సంజీవ్ విమర్శలు గుప్పించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదురు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా సీబీఎస్ఇ చీఫ్కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. ఓఎస్ఎం వ్యవస్థ అమలు, విద్యార్థులు నివేదించిన సమస్యలపై కమిటీ సభ్యులకు వివరించడానికి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్తో పాటు సిబిఎస్ఇ చీఫ్ రాహుల్ సింగ్ను పార్లమెంటరీ విద్యా స్థాయీ సంఘం ముందు హాజరుకావాలని పార్లమెంటరీ ప్యానెల్ ఆదేశించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana