Dailyhunt
కేరళంలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

కేరళంలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

వతెలంగాణ-హైదరాబాద్: 140 స్థానాలున్న కేరళం అసెంబ్లీకి ఒకే దఫాలో ఈ నెల 9న పోలింగ్ జరగనుంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈక్రమంలోనే నేటి సాయంత్రంతో ఎన్నిల ప్రచారం ముగియనుంది.

దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఏ గల్లీ చూసినా ప్రచార వాహనాలతో నిండిపోయింది. రహదారులన్ని ఆయా రాజకీయ పార్టీల కార్యకర్తలతో కిటకిటలాడుతున్నాయి. మైక్ సెంట్లతో ప్రచారాన్ని హోరోత్తిస్తున్నాయి.

ఎలక్షన్ ప్రచారానికి చివరి రోజు కావడంతో అన్ని పొలిటికల్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార పార్టీ ఎల్డ్ఎఫ్ మూడోసారి అధికారంలోకి రానుందని ఇటీవల విడుదలైన ఓపినియన్ పోల్స్ పేర్కొన్నాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా ఆయా నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర అగ్రనాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. చివరి రోజు కావడంతో బీజేపీ కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana