Friday, 02 Oct, 4.46 am నవ తెలంగాణ

రాష్ట్రీయం
ఖమ్మం ఎంపీ 'నామా'కు మాతృవియోగం

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామా నాగేశ్వరరావు మాతృమూర్తి వరలక్ష్మి(91) హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో గురువారం మధ్యా హ్నం మృతిచెందారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన ఆమె 15 రోజులుగా చికిత్స పొందారు. ఆమె మృతదేహాన్ని గురువారం రాత్రి ఖమ్మం తీసుకొ చ్చారు. ఖమ్మంరూరల్‌ మండలం గొల్లగూడెంలోని మధుకాన్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీ ఆవరణలో శుక్రవారం సాయంత్రం 3 గంటలకు అంత్య క్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అన్నీ తానై నామ నాగేశ్వరరావు ఎదుగుదలకు తోడ్పాటునందిచ్చిన ఆమె ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాల ద్వారా ఉమ్మడి జిల్లా ప్రజలకు చేరువయ్యారు. ఆమె మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, పురపాలక, ఐటీ శాఖమంత్రి కె.తారకరామారావు, జిల్లా మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తదితరులు సంతాపం తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top