మెదక్ : మెదక్ జిల్లా కొల్చారం మండలంలో మెదక్- హైదరాబాద్ జాతీయ రహదారి కిష్టాపూర్ వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా నలుగురు దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వస్తున్న ఆటో, కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న కారు.. మెదక్ నుంచి కిష్టాపూర్ వైపు తొమ్మిది మందితో వెళ్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
