Dailyhunt
కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు

కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు

వతెలంగాణ - కంఠేశ్వర్ గణేశ్ నిమజ్జనాలు నిజామాబాద్ నగరంలో రెండో రోజైన బుధవారం మధ్యాహ్నం వరకూ కొనసాగుతూనే ఉంది. ఎనిమిది ఫీట్ల కన్నా ఎక్కువ ఎత్తున్న విగ్రహాలను నగరంతో పాటు ఆయా ప్రాంతాల నుంచి ఉమ్మెడ గోదావరి తీరానికి తరలిస్తున్నారు.

భారీ విగ్రహాలు నగరం మీదుగా తరలిస్తున్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా రథ యాత్ర కూడా నెమ్మదిగా నే సాగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైన రథం వినాయక భాని కి చేరుకోవడానికి దాదాపు అర్ధ రాత్రి 12 నుండి 12:30 గంటలైంది. నగరంలో మిగితా గణపతులను నిమజ్జనం కోసం తరలించే విషయంలో జాప్యం చేసారు. ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాలను బాసర గోదావరి చెరువు కు తరలించారు.

భారీ విగ్రహాలను మాత్రం నందిపేట్ మండలం ఉమ్మెడ లో గోదావరి నదిసమీపంలో ఉమామహేశ్వరుని వద్దకు చేరుకున్న గణనాథుడు ఈ సంవత్సరం ఉమ్మెడ లోని ఉమామహేశ్వర ఆలయం వద్ద నిజామాబాద్ మహాగణపతులు నిమజ్జనం అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో భజన కీర్తనలతో డీజే సౌండ్ లతో కోలాహాలంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. అధికారులు పూర్తి సౌకర్యాలు కల్పించారు, ఎక్కడ అంతరాయం కలగకుండా మూడు క్రేన్ల ద్వారా నిమజ్జనం చేయించారు. భారీ విగ్రహాలను గోదావరి వద్ద భారీ క్రేన్ లను అందుబాటు లో పెట్టారు. ఇక్కడ భారీ విగ్రహాలు మంగళవారం త అర్థ రాత్రే చేరుకుంటాయని భావించారు. కానీ మరుసటి రోజు ఉదయం అంటే బుధవారం ఉదయం 10 నుండి 11 గంటల తరవాతే వచ్చాయి. పూర్తయ్యేసరికి సుమారు సాయంత్రం అవుతుందని సంబంధిత అధికారులు అక్కడే ఉండి అంచనా వేస్తున్నారు. అందుకని గుణంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana