మహారాష్ట్ర : రాష్ట్రంలో వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతోంది. ముంబయిలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలవుతోంది. నిత్యం రద్దీగా ఉండే జంక్షన్లు అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. పోలీసులు నిత్యం పహారా కాస్తున్నారు. కాగా కొన్ని అత్యవసర షాపులు మాత్రం తెరిచి ఉన్నాయి. జనం వ్యాక్సిన్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. రేపు ఉదయంతో లాక్ డౌన్ ముగుస్తుంది.

