Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొండారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

కొండారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

వతెలంగాణ - వనపర్తి : పెద్దమందడి మండలం బలిజ పల్లె గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు కొండారెడ్డి గారి భార్య శకుంతల గారు మరణించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు వారి ఇంటికి వెళ్లి కొండారెడ్డి గారిని వారి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.

శకుంతల గారు లేని బాధ నుంచి కోలుకొని ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి మండల్ సింగల్ విండో మాజీ అధ్యక్షుడు సహదేవుడు, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి మండల్ NSUI అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, సీనియర్ నాయకులు ఎంట్ల రవి, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana