Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొండంపేటలో సతికి బదులు పతి పెత్తనం

కొండంపేటలో సతికి బదులు పతి పెత్తనం

కాంగ్రెస్ నాయకుడు ఏనుగు లక్ష్మీ నారాయణ ఆరోపణనవతెలంగాణ - మల్హర్ రావు
మండలం కొండంపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ సతికి బదులుగా పతి పెత్తనం చేస్తూ దళితులను భయాందోళనకు గురి చేస్తున్నట్లుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏనుగు లక్ష్మీ నారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత పారదర్శకంగా జరగలేదన్నారు. ఇందిరమ్మ కమిటీ ఎంపిక చేసిన జాబితాను సర్పంచ్ భర్త అర్హులైనవారిని తొలగించి ఆయనకు అనుకూలంగా ఉన్నవారి పేర్లను జాబితాలో రాయించినట్లుగా ఆరోపించారు. ఇందుకు నిదర్శనమే మొదటి విడతలో తనకు ఇందిరమ్మ ఇల్లు వస్తే సర్పంచ్ భర్త కక్షపూరితంగా వ్యవహరించి తన పేరును తీయించడాని తెలిపారు. గ్రామంలో సతికి బదులుగా పతి పెత్తనం చేస్తూ దళితులను చిన్నచూపు చూస్తూ దొర పోకడ చూపిస్తున్నట్లుగా వాపోయారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana