Dailyhunt
కొత్త స్మార్ట్ ఫోన్లపై అంగన్వాడీలకు అవగాహన: సీడీపీఓ

కొత్త స్మార్ట్ ఫోన్లపై అంగన్వాడీలకు అవగాహన: సీడీపీఓ

వతెలంగాణ - మద్నూర్రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు కొత్త స్మార్ట్ ఫోన్లు అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా అంగన్వాడీ టీచర్లకు కొత్త స్మార్ట్ ఫోన్ల యాప్ పై ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు మద్నూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ కళావతి తెలిపారు.

మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు బుధవారం స్మార్ట్ ఫోన్ యాప్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. పోషణ యాప్ ద్వారా గర్భిణీలకు బాలింతలకు చిన్నారుల వివరాలు పౌష్టిక ఆహారం పంపిణీ వంటి వివరాలు సుమారు 14 రకాల అంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అంగన్వాడీలు మరింతగా సమర్థవంతంగా పనులు చేయడానికి వీలు కలుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు కవిత, వినోద ,తదితరులతో పాటు బాలకృష్ణ, ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana