జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి.
ఈ నెల 17,18వ తేదీల్లో హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా జరిగే ఆడిషన్స్ నుంచి వివిధ దశల వడబోత తర్వాత పోటీదారులను ఎంపిక చేయనున్నారు. ఆడిషన్స్ నుంచి ఎంపికైన వారు 90 రోజుల పాటు అడవిలో ఉంటూ కార్యక్రమ నిర్వాహకులు సూచించే సాహసాలు చేయాల్సి ఉంటుంది. ఎలిమినేషన్స్ తట్టుకుని మిగిలిన కంటెస్టెంట్స్ విజేతలుగా నిలుస్తారు. శనివారం జరిగిన జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ లో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్స్ ప్రభు, వైజే రాంబాబు, సురేష్ కొండేటి తదితరులు ఈ రియాల్టీ షోలో ఉన్న ప్రత్యేకతను కొనియాడారు. డైరెక్టర్ యశోధర విక్రమ్ మాట్లాడుతూ,'జంగిల్ బుగికి దర్శకత్వం వహించడం ఛాలెంజింగ్ గా తీసుకున్నానుఅని అన్నారు. 'ప్రకృతికి మనం దూరమై పోతూ ఉన్నాం. ప్రకృతి..ఎంత గొప్పగా ఉంటుందో అందరికీ చూపించాలనే లక్ష్యంతో ఈ రియాల్టీ షో నిర్వహిస్తున్నాం అని ఎపిక్ ప్రొడక్షన్స్ అధినేత పార్థసారథి చెప్పారు.

