Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుమార్తె పుట్టినరోజున అంగన్వాడీకి కుర్చీల వితరణ

కుమార్తె పుట్టినరోజున అంగన్వాడీకి కుర్చీల వితరణ

- సేవా గుణాన్ని చాటుకున్న అస్పత్ వార్ అరుణ్ - శ్వేత దంపతులునవతెలంగాణ - జుక్కల్
పిల్లల పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు పోకుండా, సమాజానికి ఉపయోగపడేలా జరుపుకొని పలువురికి ఆదర్శంగా నిలిచారు పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన అస్పత్ వార్ అరుణ్ మరియు శ్వేత దంపతులు.

తమ కుమార్తె అద్వైత పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎడ్గి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో వారు ప్రత్యేక వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్రంలోని చిన్నారి పిల్లల సౌకర్యార్థం అస్పత్ వార్ అరుణ్ - శ్వేత దంపతులు తమ స్వంత ఖర్చులతో కుర్చీలను కొనుగోలు చేసి, అంగన్వాడీ కేంద్రం సిబ్బందికి అందజేశారు. అనంతరం అంగన్వాడీ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి, వారికి మిఠాయిలు పంపిణీ చేస్తూ అద్వైత పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ:

'మా కుమార్తె అద్వైత పుట్టినరోజును ఇలా అంగన్వాడీ కేంద్రంలోని ముద్దులొలికే చిన్న పిల్లల మధ్య, వారికి ఉపయోగపడే వస్తువులను అందిస్తూ జరుపుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇచ్చింది. ప్రతి ఒక్కరూ తమ పిల్లల పుట్టినరోజుల సందర్భాల్లో ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి' అని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తాతయ్య వినోద్(మాజీ సర్పంచ్), తాజా సర్పంచ్ అనిల్, అంగన్వాడీ టీచర్లు ప్రమీల, యమున, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొని, అంగన్వాడీ కేంద్రానికి కుర్చీలు విరాళంగా ఇచ్చిన అరుణ్ - శ్వేత దంపతులకు కృతజ్ఞతలు తెలుపుతూ, చిన్నారి అద్వైతకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేసి, దీవించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana