హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. తన 17 సంవత్సరాల కుమార్తె తల నరికిన ఓ తండ్రి, ఆ తలను చేత్తో పట్టుకుని నడి వీధుల్లో వీరంగం వేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. పండితారా గ్రామానికి చెందిన సర్వేశ్ కుమార్ అనే వ్యక్తి, నరికేసిన తన కుమార్తె తల చేత్తో పట్టుకుని నడుస్తుండగా గ్రామస్థులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఇద్దరు పోలీసు అధికారులు సర్వేశ్ నడుస్తున్న మార్గాన్ని అడ్డగించి ఆ తల ఎవరిదని ప్రశ్నించగా, ఏ మాత్రం సంకోచం లేకుండా, అది తన కుమార్తెదని, తాను ఎలాంటి తప్పూ చేయలేదని, హత్య చేసింది మాత్రం తానేనని చెప్పాడు.
ఇదీ చదవండి
చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

