Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లంచం తీసుకుంటూ ఏసీబీకి 
చిక్కిన విద్యుత్ శాఖ ఏడీఈ

లంచం తీసుకుంటూ ఏసీబీకి 
చిక్కిన విద్యుత్ శాఖ ఏడీఈ

కాంట్రాక్టర్ బిల్లులు ఫార్వర్డ్ చేసేందుకు లంచం డిమాండ్నవతెలంగాణ-నర్సాపూర్

కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా నర్సాపూర్ విద్యుత్ శాఖ ఏడిఈ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.

ఏసీబీ డీఎస్పీ కె.సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. 2023 నుంచి 2025 వరకు ఓ కాంట్రాక్టర్ 11 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లకు సంబంధించిన రూ.3 లక్షల 15 వేల పనులు పూర్తి చేశారు. వీటి బిల్లులు ఫార్వర్డ్ చేయడానికి సదరు కాంట్రాక్టర్ను నర్సాపూర్ ఏడిఈ రమణారెడ్డి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఈనెల 20వ తేదీన కాంట్రాక్టర్ మెదక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

విషయాన్ని నిర్ధారించుకోవడానికి కాంట్రాక్టర్ను ఏడిఈ దగ్గరకు పంపగా రూ.20 లేదా రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో కాంట్రాక్టర్తో డబ్బులు పంపించగా ఏడీఈ రమణారెడ్డి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏడిఈ రమణారెడ్డిని కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. ఎక్కడైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్లు వెంకటేష్, రమేష్ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana