Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాచారెడ్డిలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

మాచారెడ్డిలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

వతెలంగాణ - కామారెడ్డి/ మాచారెడ్డిమాచారెడ్డి మండల కేంద్రంలో భారత రత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

మండల పార్టీ అధ్యక్షులు మాలోత్ నౌసిలాల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ శ్రేణులు స్మరించుకున్నాయి.

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల బలోపేతానికి రాజీవ్ గాంధీ కీలకంగా పనిచేశారని, భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించిన టెక్నాలజీ దూరదృష్టి నాయకుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా రాజీవ్ గాంధీకే దక్కుతుందని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ నునావత్ గణేష్ నాయక్, యూత్ అధ్యక్షుడు రాజిరెడ్డి, అలీ ఖాన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాంచంద్రం, షేక్ అజీజ్, సర్పంచ్ అనిల్, నారగౌడ్, తిరుపతి, రంజాన్, రవి, దేవయ్య, మోహన్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana