నవతెలంగాణ - హైదరాబాద్ : సూర్యాపేట మండలం ఎర్కారంలో మాజీ సర్పంచ్ చింతలపాటి మధు దారుణ హత్యకు గురయ్యారు. హత్య చేసి గోనెసంచుల్లో కట్టి గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో పడేశారు.
కొన్నేళ్ల క్రితం అప్పటి సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

