Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాకు అమెరికాపై 
నమ్మకం లేదు

మాకు అమెరికాపై 
నమ్మకం లేదు

శాంతికి ప్రధాన అడ్డంకి ట్రంపే : ఇరాన్ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ
న్యూఢిల్లీ : అమెరికా దౌత్య విశ్వసనీయతపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్ర విమర్శలు గుప్పించారు.

పశ్చిమాసియాలో శాంతికి అమెరికాయే ప్రధాన అడ్డంకిగా ఉందని మండిపడ్డారు. నెల రోజులకు పైగా సైనిక లక్ష్యాలు విఫలమైన తర్వాత అమెరికా చర్చల వైపు మళ్లడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. అయితే ఈ చర్య పట్ల టెహ్రాన్లో తీవ్ర సందేహాలు వ్యక్తమయ్యాయని వెల్లడించారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరాగ్చీ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

'40 రోజులపాటు యుద్ధం చేసిన తర్వాత కూడా ఇరాన్లోని ఏ లక్ష్యాన్ని అమెరికా సాధించలేకపోయింది. దీంతో అమెరికా నిరాశ చెందింది. అప్పుడు మాతో చర్చలకు ముందుకు వచ్చింది. మాకు అమెరికన్లపై నమ్మకం లేదు.

ఏ దౌత్య ప్రయత్నానికైనా అమెరికానే ప్రధాన అడ్డంకి. అమెరికన్లను నమ్మకపోవడానికి మాకు అన్ని కారణాలూ ఉన్నాయి. కానీ మమ్మల్ని నమ్మకపోవడానికి వారికి ఎలాంటి కారణమూ లేదు' 'ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య చాలా బలహీనమైన కాల్పుల విరమణ కొనసాగుతోంది. దౌత్యానికి ఒక అవకాశం ఇవ్వడానికి మేం కాల్పుల విరమణను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాం.

ఇరాన్కు సంబంధించిన దేనికీ సైనిక పరిష్కారం లేదు. అమెరికన్లు మమ్మల్ని పదేపదే పరీక్షించారు. మేం ఏ ఒత్తిడికి లేదా బెదిరింపులకు తలొగ్గం. మేం ఏ బెదిరింపులనైనా ప్రతిఘటిస్తాం. ఇరాన్ సహనాన్ని లొంగిపోవడంగా పొరపాటు పడకూడదు' అని అబ్బాస్ అరాగ్చీ వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana