Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మార్కెట్ కు వచ్చిన పంట ప్రభుత్వం కొంటుంది: మాజీ మంత్రి

మార్కెట్ కు వచ్చిన పంట ప్రభుత్వం కొంటుంది: మాజీ మంత్రి

వతెలంగాణ - సారంగాపూర్ : మార్కెట్ కు తెచ్చిన పంట ప్రభుత్వం కొంటుంది. రైతులు అధైర్య పడద్దు అని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతులకు భరోసా కల్పించారు.

గురువారం మండలకేంద్రంతోపాటు కౌట్ల(బి), జామ్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఎండలు సైతం లెక్కచెయ్యకుండా రైతులు ఇబ్బందులను పరిష్కరించ డానికి స్వయంగా తన అనుచరులతో బయలుదేరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోడంలను పరిశించి..రెండు వారాలు కష్టపడితే మొక్కజొన్న జొన్న వరి ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుందన్నారు.ఎండలో సైతం తూకం వేస్తున్న దాడ్వాయి, హమాలీ లను అభినందిందించారు.

రైతుల ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మొక్కజొన్న జొన్న పంటలను తరలించడానికి స్థానికంగా ట్రాక్టర్లను వినియోగించడానికి స్థానిక నాయకులు బాధ్యతలు తీసుకోవాలన్నారు. కొనుగోలు విషయమై జిల్లా కలెక్టర్ తో సమగ్రంగా చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. కొనుగోలు పూర్తి అయ్యేవరకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మాజీ మంత్రి వెంటా ..సొసైటీ అధ్యక్షులు నారాయణ రెడ్డి,మాణిక్ రెడ్డి, నాయకులు అల్లోల మురళీధర్ రెడ్డి,పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, దశరథ రాజేశ్వర్, సత్యనారాయణ, భోల్లోజి నర్సయ్య, నర్సారెడ్డి, నారాయణ రెడ్డి, స్థానిక సర్పంచ్ కునేరు భూమన్న, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana