నవతెలంగాణ - మర్రిగూడ : రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించి అధిక దిగుబడులు పొందాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ నలిని రైతులకు సూచించారు.
గురువారం మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో ఉన్న రైతు వేదికలో నిర్వహించిన 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు'కార్యక్రమంలో వారు మాట్లాడారు.పంట మార్పిడి, పచ్చి రొట్ట పైర్లను సాగు చేసి పూత దశలోపే భూమిని కలియదున్ని భూసారాన్ని పెంచాలని తెలిపారు. రసాయన ఎరువులను అవసరం మేరకే వినియోగించి, అవసరం మేరకే యూరియాను వాడాలని, సాగు ఖర్చు తగ్గించు కోవాలని రైతులకు వివరించారు. అదేవిధంగా నీటిని ఆదా చేయు పద్ధతులైన బిందు సేద్యం,సేంద్రియ ఎరువుల ఆవశ్యకత,నాణ్యమైన విత్తనాలపై రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష్ యాదవ్, శ్రీలత, అరుణ, జయంతి వ్యవసాయ విస్తరణాధికారులు, ఆదర్శ రైతులు,గ్రామ రైతులు పాల్గొన్నారు.

