- క్యూ2 లాభాల్లో 65 శాతం పతనం
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయరీ కంపెనీ మారుతి సుజుకి నికర లాభాలు అంచనాలు మించి క్షీణించాయి.
దీంతో పోల్చితే భారీ తగ్గుదల చోటు చేసుకున్నట్లయ్యింది. కంపెనీ అమ్మకాలు 9.09 శాతం పెరిగి రూ.19,297.80 కోట్లుగా నమోదయ్యాయి. ఎలక్ట్రానిక్ చిప్‌ల కొరతతో 1.16 లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయామని ఆ కంపెనీ తెలిపింది. గడిచిన త్రైమాసికంలో మొత్తంగా 3,93,130 యూనిట్లను అమ్మకాలు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ2లో 3,70,619 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
